AP: విద్యుత్తు ఛార్జీలు పెంచితే ఉద్యమం తప్పదని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. ఎన్నికలల్లో ఇచ్చిన హామీలకు భిన్నంగా కూటమి ప్రభుత్వ కార్యచరణ ఉందన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు పెంచుతామని CM చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. దాని అమలుకు 32 లక్షల లబ్ధిదారులను సమీకరించి నవంబర్ 18న సామూహికంగా దరఖాస్తులు ఇస్తామని పేర్కొన్నారు.