TG: ప్రముఖ జానపద కళాకారుడు సుద్దాల హన్మంతు-జానకమ్మ జాతీయ పురస్కార ప్రధాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పురస్కార ప్రదానోత్సవం వేడుక జరిగింది. ఈ ఏడాదికి గాను అరుణోదయ కళాకారుడు నాగన్నకు పురస్కారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నాగన్న సుద్దాల ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.