MHBD: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు శనిగాపురం గ్రామంలో నిర్మిస్తున్న సైడ్ కాలువను ఎమ్మెల్సీ తక్కెనపల్లి రవీందర్రావు శుక్రవారం పరిశీలించారు. నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ మర్నీని వెంకన్న, కౌన్సిలర్ బానోత్ హరి సింగ్ నాయక్, తోట మల్లయ్య, కందుకూరి శ్రీను, లక్ష్మణ్ తదితరులున్నారు.