ATP: సోమందేపల్లిలోని కెనరా బ్యాంకులో బ్యాంక్ మేనేజర్ సురేశ్ శనివారం టీడీపీ నాయకులకు పది రూపాయల నాణేలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. సోమందేపల్లి మండల వ్యాప్తంగా ప్రతి షాపులో పది రూపాయల నాణేం తీసుకోవాలని, క్రయ విక్రయాల్లో పది రూపాయల నాణేం వాడాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించి, ఖచ్చితంగా పది రూపాయల నాణేం క్రయవిక్రయాలు జరిగేలా చూస్తామని తెలిపారు.