GNTR: బ్రాండెడ్ డెయిరీల నుండి మాత్రమే నెయ్యి కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ, ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. తెనాలి వైకుంఠపురంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డు విషయంలో జరిగిన ఇబ్బందుల దృష్ట్యా లడ్డు ప్రసాదంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.