కృష్ణా: గుడివాడ 1టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గోవుని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రక్తపు మడుగులో ఉన్న ఆవుకు ఆర్కే వారియర్స్ వైద్యం అందించారు. అనంతరం సామాజికవేత్త రామకృష్ణ మాట్లాడుతూ.. గోవు యజమానులు రోడ్లమీద వాటిని వదిలేయడంతో రోడ్లమీద ఉన్న చెత్తాచెదారం ప్లాస్టిక్‌ను తింటూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. గోవు యజమానులపై చర్యలు తీసుకోవాలన్నారు.