KDP: కలసపాడు మండల పరిషత్ సభా భవనంలో MPDO మహబూబ్బి అధ్యక్షతన గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు తదితరాలపై దృష్టి సారించాలన్నారు.