ఈ నెల 27వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేద్దామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు పాతుకుల శ్రీశైలం పిలుపునిచ్చారు. కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మాలలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. ఆత్మగౌరవ సభకు సంబంధించిన పోస్టర్ ను పదర మండల కేంద్రంలో ఆవిష్కరించారు.