TG: గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించటం లేదా అని మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ‘GO.29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. BRS తెచ్చిన జీవో 55ను ఎందుకు రద్దు చేశారు. కాంగ్రెస్‌లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. నిరసన తెలిపే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? నిరుద్యోగుల ఆందోళనలపై రాహుల్ గాంధీ స్పందించాలి’ అని డిమాండ్ చేశారు.