ప్రకాశం: స్వయం సహాయక సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు వడ్డీలేని రుణాలను ప్రభుత్వం అందిస్తుందని వెలుగు కొండపి మండల ఏపీఎం గోపినాథ్ తెలిపారు. స్థానిక ఐకేపీ కార్యాలయంలో గ్రామ సంఘ సహాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందిస్తున్న పథకాల గురించి విఓఏలు గ్రూపు సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు.