AKP: నర్సీపట్నం డిపో బస్సు చింతపల్లి నుండి నర్సీపట్నం బస్సు వస్తుండగా డౌనూరు మర్రిపాలం మధ్యలో అదుపు తప్పి ప్రమాదానికి గురి అయింది. పక్కనే ఉన్న గోతిలోకి దూసుకుపోవడంతో ప్రయాణికులకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అయితే ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న డిపో మేనేజర్ ధీరజ్ మరో బస్సును ఘటన స్థలానికి పంపించారు.