AP: అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ల్యాండ్ పూలింగ్ చేసిన చరిత్ర అమరావతికి దక్కింది. మొత్తం 54 వేల ఎకరాల భూమి అమరావతికి సేకరించాం. CRDA భవనం 4 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రం నడిబొడ్డున అమరావతి రాజధానిగా ఉంటుంది. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం అని పేర్కొన్నారు.