NLR: 21వ తేదీ పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ఆత్మకూరులో విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో స్థానిక డీఎస్పీ నేతృత్వంలో శనివారం ఈ పోటీలు నిర్వహించారు. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో మండలంలోని విద్యార్థిని విద్యార్థులకు ప్రజా సేవలో పోలీస్ పాత్ర అనే అంశంపై చిత్రలేఖన పోటీలను నిర్వహించడమైనదని అన్నారు.