జనగాం: పాలకుర్తి పోలీసు స్టేషన్ ఘటనపై జాతీయ ST కమిషన్ సీరియస్ అయింది. CI మహేందర్, SI సాయి ప్రసన్నలను సస్పెండ్ చేయాలంటూ పాలకుర్తి పోలీసు స్టేషన్ ఎదుట లకవత్ శ్రీను ఆత్మహత్యకు పాల్పడి ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి తల్లిదండ్రులు ST కమిషన్ను ఆశ్రయించగా.. ST కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.