JGL: గొల్లపల్లి మండలకేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి హాస్పిటల్ వారు ఉచిత నేత్రవైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 50మందికి పరీక్షలు నిర్వహించగా 30మందిని కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించారు. కార్యక్రమంలో బొమ్మన కుమార్, సాయిని నరహరి, సత్యనారాయణ, శేఖర్, రమేష్, కిషన్, సురేష్, పాల్గొన్నారు.