NLR; నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ షెల్టర్ల పనులకు శనివారం టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 18 గ్రామాల్లో 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, డ్రెయిన్లు, మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్నాం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.