SKLM: ఆమదాలవలస పట్టణంలో చేపల మార్కెట్ పక్కన అర్బన్ డ్వాక్రా బజార్ ఏర్పాటు చేశారు. ఈ డ్వాక్రా బజార్‌ను మెప్మా ఐబి అధికారి రామారావు సందర్శించారు. ఈ మేరకు మహిళలు తయారుచేసిన స్టాల్స్‌ను పరిశీలించి విక్రయాలపై ఆరా తీశారు. మహిళల అభ్యున్నతికి డ్వాక్రా బజారును ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు.