TG: కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ‘అసలు దోస్తాన్ కేసీఆర్, కాంగ్రెస్ మధ్యనే ఉంది. హర్యానా, కశ్మీర్ ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపింది వాస్తవం కాదా కేటీఆర్? ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణలు ఏమయ్యాయి రేవంత్? BRS, కాంగ్రెస్ మధ్య స్నేహం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి’ అని పేర్కొన్నారు.