లక్ష కోట్ల రూపాయలతో ఒడిశాలో అల్యూమినా రిఫైనరీ, హరిత అల్యూమినియం ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు లోహాలు, గనుల సంస్థ వేదాంత తెలిపింది. 6 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రిఫైనరీ, 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ స్థాపించనున్నట్లు పేర్కొంది. దీంతో 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పింది. ఈ పెట్టుబడులతో భారీ పారిశ్రామిక సముదాయం ఏర్పాటవుతుందని తెలిపింది.