PLD: రొంపిచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించాల్సిన ఉమ్మడి జిల్లా అండర్-14 బాల, బాలికల సాఫ్ట్ బాల్ పోటీలు, జిల్లా జట్ల ఎంపిక వేదికను మార్చినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ బాలుర వసతిగృహ మైదానంలో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నామని హెచ్ఎం సుభాని, పీడీ సైదయ్య తెలిపారు.