ATP: అనంతలోని కంబదూరు ప్రాంతాన్ని క్రీశ 6-10వ శతాబ్దం వరకు చోళులు, కళ్యాణి చాళుక్యులు అనే రాజా వంశీయులు పరిపాలించారు. వీరి పరిపాలన కాలంలో రాజ్య స్థాపన కోసం యుద్ధాలు జరిగాయని శాసనాలు చెబుతున్నాయి. ఈ యుద్ధంలో పలువురు ప్రాణాలు కూడా విడిచారు. చాళుక్య యుగంలో తరచు యుద్ధాలు జరగడంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.