CTR: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కడ పీడి వికాస్ మర్మత్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.