SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని నేడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకోనున్నారు. ఆలయంలో పూజల అనంతరం బద్ది పోచమ్మను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించనున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నారు.