తిరుమల హిందువులు అత్యంత పవిత్ర స్థలంగా భావించి, ఆ దేవదేవుణ్ణి కొలుస్తారు. ఇక్కడి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా అందించే లడ్డూ అనేది భక్తులకు అత్యంత పవిత్రతం గా భావిస్తారు. నేటికి ఎంతోమంది భక్తులకు తిరుమల ప్రయాణం అంటే అదొక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి. ప్రతి భక్తుడికి వెంకన్నను దర్శించుకోవడం అనేది ఒక ఎమోషన్.
ప్రస్తుత ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, జంతువులకు సంబందించిన కొవ్వు పదార్ధాలతో కల్తీ చేసారని అభ్యన్తరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ప్రతి భక్తుడు భావోద్వేగాయానికి లోనయ్యారు. ప్రతిపక్ష పార్టీ YSRCP నాయకుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, ఇతర నేతలైన వై.వి. సుబ్బ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఆరోపణలకు స్పందించారు. తరువాత ఈ వివాదం సుప్రీం కోర్టుకు వెళ్లింది.
సుప్రీం కోర్టు ఈ కేసు గురించి విచారణ చేసి, లడ్డూ కలుషితమైందా లేదా అనే విషయంలో సాక్ష్యాలను అడిగింది.. ప్రభుత్వ ఆరోపణలపై అనేక అంశాలను కోర్టు ప్రస్తావించింది. ఇంకా విచారణ జరుగుతున్నప్పుడు మీడియా ముందు ఎందుకు వెళ్లారు? , రాజకీయాలను దేవుడి నుండి దూరంగా ఉంచాలని కోర్టు సూచించింది.
ఈ వివాదం ప్రభుత్వానికి తీవ్ర ప్రతికూలతగా మారవచ్చని, చంద్రబాబు నాయుడి పాలనపై బ్లాక్ మార్క్ గా నిలిచిపోవచ్చని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తిరుమల లడ్డూ వివాదం భక్తుల మనోభావాలను హర్ట్ చేసే విధంగా మారిందని ప్రజల మధ్య తీవ్ర చర్చలకు దారి తీసింది. ఈ కేసు సుప్రీమ్ కోర్ట్ పరిధిలో ఉండటం వలన ప్రభుత్వం ఏర్పరిచిన సిట్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రస్తుతం నిలిపివేశారు