AP: అడుగడుగునా కులవివక్షను ఎదుర్కొంటూనే తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి గుర్రం జాషువా అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన దళితాభ్యుదయవాది, సమసమాజ నిర్మాణ స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆ దార్శనికుని సంఘ సంస్కరణ పోరాటాన్ని, ఆ మహాకవి సాహితీ సేవను స్మరించుకుందామని పేర్కొన్నారు. ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నా అని సీఎం ట్వీట్ చేశారు.