‘కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి.. పంజరాన గట్టు వడను నేను నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు తరగు లేదు విశ్వనరుడ నేను’ అంటూ ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా జయంతి నేడు. ఆయన తక్కువ కులంలో జన్మించిన కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ పురస్కారం అందజేసింది.