నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 50ఏళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ఇందుకు గాను IIFA-2024 వేడుకలో ఆయన స్పెషల్ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ చేతుల మీదుగా ఆయన ‘ఐఫా గోల్డెన్ లెగసీ’ అవార్డును అందుకున్నారు. అవార్డు ఇచ్చే ముందు కరణ్ బాలయ్య పాదాలకు నమస్కరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే సమంత ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు.