సుప్రీంకోర్టులో ‘12th ఫెయిల్’ సినిమాను ప్రదర్శించారు. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన చిత్రం ‘12th ఫెయిల్’. విక్రాంత్ మస్సే కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు దాదాపు 600 మంది న్యాయవాదులు, ఇతర అధికారుల కోసం సుప్రీంకోర్టులో దీనిని ప్రత్యేకంగా ప్రదర్శించారు.