US: లాస్ ఏంజిల్స్‌లో జరిగిన బియాండ్ ఫెస్ట్‌లో దేవరను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో అందులో పాల్గొన్న ఎన్టీఆర్.. అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జపాన్‌లోని టోక్యో నుంచి వచ్చిన ఓ మహిళా అభిమాని.. జపాన్‌కు రమ్మని ఎన్టీఆర్‌ను ఆహ్వానించింది. దీంతో ‘మీ దేశానికి తప్పకుండా వస్తా’ అని ఆమెకు ఎన్టీఆర్ మాటిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.