‘దేవర’ రిలీజైన సందర్భంగా NTR ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. తాను ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న రోజు వచ్చిందన్నారు. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అద్భుతమైన డ్రామా, భావోద్వేగాలతో దేవరను తెరకెక్కించిన కొరటాల శివకు, మంచి సంగీతం అందించిన అనిరుధ్, నిర్మాతలు, మూవీ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. తన ఫ్యాన్స్‌కు మరింత వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నానని అన్నారు.