తెలుగు రాష్ట్రాల ఆడియన్స్‌పై బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఆడియన్స్ అక్కడి హీరోలను ఎంతగానో ఆదరిస్తారని.. ప్రేక్షకులు వారి అభిమాన హీరోలను దేవుళ్లలా చూస్తారని కామెంట్స్ చేశారు. కాగా, ఇవాళ విడుదలైన ‘దేవర’ సినిమాతో సైఫ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.