VSP: బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టిన ఆర్.కృష్ణయ్యను ప్రజలు క్షమించరని మాజీ మంత్రి కె నాగేశ్వరరావు విమర్శించారు. బీసీలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో కృష్ణయ్యకు రాజ్యసభలో జగన్ అవకాశం కల్పించారని అన్నారు. విశాఖలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేయడంపై మాజీ మంత్రి పై విధంగా స్పందించారు.