TG: అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. BFSI స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పదేళ్ల తర్వాత కూడా రాష్ట్రంలో భారీగా నిరుద్యోగం ఉందన్నారు. రాష్ట్రంలో 50-60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకొని ఆచరణలో పెడుతున్నామని స్ఫష్టం చేశారు. ఇప్పటికే 35 వేల పోస్ట్‌లకు నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు.