చర్మ సౌందర్యానికి కలబంద చక్కగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జులో చిటికెడు పసుపు, కాస్త తేనె, రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు పోతాయి. కలబందని నీళ్లలో మరిగించి పేస్ట్ చేసుకుని దానికి కొంచెం తేనె కలిపి అప్లై చేసుకుంటే మొటిమల సమస్య తగ్గుతుంది. పొడిచర్మం గలవారు కలబంద గుజ్జులో ఆలివ్ ఆయిల్ కలిపి వాడొచ్చు.