W.G: ఝార్ఖండ్లో విద్యనభ్యసిస్తున్న మండవల్లి మండలం తక్కెళ్లపాడుకు చెందిన విద్యార్థి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన జల్లి ఆకాష్(21) ఝార్ఖండ్ రాజధాని రాంచిలోని ఓ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈనెల 21న కళాశాల సమీపంలోని ఓ కొలనులో ఈత కొడుతూ మృతి చెందినట్లు అక్కడి కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు.