AP: వేంకటేశ్వర స్వామిపై జగన్కు నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యమని CM చంద్రబాబు అన్నారు. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యతను గౌరవించనప్పుడు తిరుమల ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండాలని నాడు ప్రజలు వైసీపీకి అధికారం ఇవ్వలేదని హెచ్చరించారు. మనందరం ఉండి కూడా దేవుడికి ఇలా అపరాధం జరిగిందంటే బాధ కాదా అని ఆవేదన వ్యక్తం చేశారు.