ఇటీవలికాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా గుజరాత్లో జరిగిన ఇటువంటి దుశ్చర్య వెనుక రైల్వే ఉద్యోగులే ఉన్నారని తెలియడంతో.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు, పోలీసులు కంగుతిన్నారు. సుభాష్ పొద్దార్ అనే రైల్వే ఉద్యోగి తన ప్రమోషన్ కోసం రైలును పట్టాలు తప్పించాలని ప్లాన్ చేశాడని విచారణలో తేలింది.