TG: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో యాదాద్రి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని పరీక్షల కోసం HYD ల్యాబ్‌కు పంపించారు. మదర్ డెయిరీ ఈ నెయ్యిని సరఫరా చేస్తోంది. ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే పులిహోరపైన కూడా అధికారులు దృష్టి సారిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.