TG: ‘మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం’ పేరుతో కాంగ్రెస్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారంలో బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గాంధీభవన్లో ప్రజలకు మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. రేపు తొలిరోజు మంత్రి రాజనర్సింహ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు వచ్చే నెల 30 వరకు షెడ్యూల్ ఖరారైంది. రెండు వారాలకోసారి CM రావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.