AP: ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్‌కు లేఖ రాశారు. నిర్వాహకులు రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించి విద్యార్థులకు పెడుతున్నారని ఆక్షేపించారు. మసూరి రకం బియ్యాన్నే వాడాలన్న నిబంధనను పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఐఐటీల్లో క్యాంటీన్లు, దుకాణాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించాలని కోరారు.