TG: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతుంది. ఇవాళ్టి నుంచి ఇంజినీర్లు, అకౌంట్స్ అధికారులను విచారించనుంది. ఐదు రోజుల పాటు వీరి విచారణ కొనసాగనుంది. 40 మందికి పైగా ఇంజినీర్లను కమిషన్ విచారించనున్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్ ఇంజినీర్లను కూడా కమిషన్ విచారించనున్నట్లు సమాచారం. విచారణ అనంతరం కాగ్ రిపోర్టు ఆధారంగా తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులపై చర్యలు చేపట్టనుంది.