ASR: ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో ఇటీవల జరిగిన మరణాలపై ఆరా తీసారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధులకు అస్వస్థగా ఉంటే వెంటనే ఐటిడిఏకు సమాచారం అందించి, వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టాలన్నారు.