భద్రాద్రి: గత కొద్ది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పడటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గింది. సోమవారం ఉదయం నీటిమట్టం స్వల్పంగా పెరిగిందని సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటలకు 16.8 అడుగులు కాగా 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు 16.9 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోందని వెల్లడించారు.