AP: గతకొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న తిరుపతి లడ్డూపై వైసీపీ నేత, న్యాయవాది పొన్నవొలు ఆసక్తికర వాఖ్యలు చేశారు. పంది కొవ్వు కేజీ రూ. 450 నుంచి రూ.1400 వరకు ఉంటుందని.. రూ.300లకు విక్రయించే నెయ్యిలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఇత్తడిలో ఎవరైనా బంగారం కలుపుతారా? అని ఎద్దేవా చేశారు. సిట్‌తో నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం లేదని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పొన్నవొలు డిమాండ్ చేశారు.