AP: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై ఆయన సొంత బాబాయ్, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. అనిల్ ఓ ఆర్కెస్ట్రా ఆర్టిస్ట్ అంటూ ఎద్దేవా చేశారు. మంత్రి నారాయణ ఎదుర్కొన్న కేసులు ఎవరూ ఎదుర్కోలేదన్నారు. అక్రమ అరెస్టులు, వేధింపులను ధైర్యంగా తట్టుకుని ఎన్నికల్లో 72వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తి నారాయణ అని ప్రశంసించారు. అనిల్ లాగా భయపడి నియోజకవర్గం నుంచి పారిపోలేదని సెటైర్లు వేశారు.