కామాంధుడి నుంచి ఓ బాలికను కోతుల గుంపు కాపాడింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన యూపీలోని భాగ్పట్లో చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని ఓ దుండగుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. హఠాత్తుగా అక్కడికి వచ్చిన కోతుల గుంపు బాలికను కాపాడాయి. ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం బయటకి వచ్చింది. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.