వేరుశెనగలు సాధారణంగా తిన్నా.. నానబెట్టుకుని తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే మెనోపాజ్ దశలో ఉన్నవారు వీటిని తింటే ఆ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల్లోని ఫైటోఈస్ట్రోజెన్స్ రాత్రి పూట వచ్చే చెమటను అదుపులో ఉంచుతాయి. వీటిలోని పోషకాలు ఎముక బలాన్ని పెంచి ఆస్టియోపోరోసిస్ ముప్పుని తగ్గిస్తాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తహీనత దరిచేరదు.