గత ఏడాది జూలైలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చి.. అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. అయితే రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవర్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరత్ పవార్లు మరోసారి ఏకం కావాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన శరత్ పవార్ తాము కుటుంబ సభ్యులుగా కలిసే ఉన్నట్లు వెల్లడించారు.