TG: కాళేశ్వరం కమిషన్ విచారణ మంగళవారం నుంచి శనివారం వరకు మళ్లీ కొనసాగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో ఉన్న ఇంజనీర్లను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ఈఎన్సీలను కూడా కమిషన్ ప్రశ్నించనుంది. ఇంజనీర్ల అనంతరం ఉన్నతాధికారుల విచారణ జరగనుంది. అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని నీటిపారుదల శాఖను కమిషన్ ఆదేశించింది.