W.G: భీమడోలు మండలం కూరెళ్ళగూడెం గ్రామంలో కూటమి నాయకులు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గడిచిన వందరోజుల కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు గన్ని నాగగోపాలరావు, గ్రామ కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.